For Money

Business News

రూ.1,712 కోట్లతో మరో ఎయిర్‌పోర్ట్‌

దేశంలోని అనేక ప్రముఖ ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌ కంపెనీలకు అమ్మేశారు. నిధులు లేవని.. ప్రభుత్వం వ్యాపారం చేయదని కొత్తగా నిర్మించే ఎయిర్‌పోర్టులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. కాని సొంత రాష్ట్రంలో ఎయిర్‌పోర్టును మాత్రం సొంతం నిధులతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వాటా సమకూర్చుతుండగా, మిగిలిన వాటా కేంద్ర సంస్థలు భరిస్తాయి. వెరిశి ఈక్విటీ 40 శాతం కేంద్రం, రాష్ట్రం ఇస్తుండగా, మిగిలిన 60 శాతం నిధులు బ్యాంకుల నుంచి తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కాబట్టి బ్యాంకులు కూడా కళ్ళు మూసుకుని రుణం ఇచ్చేస్తాయి. నాలుగేళ్ళలో దాదాపు రూ. 2000 కోట్లతో అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు రెడీ అయిపోతుంది….
…..
గుజరాత్‌లోని ధోలెరాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రాయాన్ని రూ. 1712 కోట్లతో నిర్మిస్తారు. తొలి దశ కింద రూ.1305 కోట్లు వెచ్చిస్తారు. దేశంలో ఉన్న ప్రభుత్వ ఎయిర్‌ పోర్టులను ప్రైవేటీకరించిన కేంద్ర ప్రభుత్వం ధొలేరా ఎయిర్‌పోర్టును మాత్రం తాను, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మిస్తాయని పేర్కొంది. మొత్తం ఎయిర్‌పోర్టును నాలుగేళ్ళలో పూర్తి చేయాలని నిర్ణయించారు.2025-26కల్లా తొలి దశ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణం పూర్తవుతుంది. ఎయిర్‌పోర్టుకు అయ్యే వ్యయంలో 40 శాతం ఈక్విటీ రూపంలో, 60 శాతం రుణం రూపంలో సమకూర్చుకుంటారు. ఈ ప్రాజక్టులో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి గుజరాత్ నిర్మిస్తుంది. కేంద్రానికి 51 శాతం వాటా ఉంటుంది. అయితే 33 శాతం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 16 శతం నేషనల్ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌కు ఉంటుంది. అంటే కేంద్ర సంస్థలు 67 శాతం ఈక్విటీ భరిస్తాయన్నమాట.