ఏ1గా మనీష్ సిసోడియా
ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఏ1గా పేర్కొంది. అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆర్వా గోపికృష్ణను రెండో నిందితుడిగా చూపింది. మొత్తం 15 మంది పేర్లను/సంస్థలను నిందితులుగా పేర్కొంది. 2021-22 ఏడాదికి సంబంధించిన ఎక్సైజ్ విధానం రూపకల్పన, అమలులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. వీటిపై విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా జులై 20వ తేదీన కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుఆర్ భల్లాకు లేఖ రాశారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ జులై 22వ తేదీన సీబీఐకి లేఖ రాస్తూ… లెఫ్టెనెంట్ గవర్నర్ లేఖపై చర్యలు తీసుకోవాలని హోం శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ లేఖ రాశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఈనెల 17వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల జాబితా ఇది.