For Money

Business News

HZLలో వాటా అమ్మకం.. కేబినెట్‌ ఓకే

ఆపదలో నెహ్రూ నిర్మించిన ఆస్తులు మోడీ ప్రభుత్వవానికి బాగా ఉపయోగ పడుతున్నాయి. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన మోడీ ప్రభుత్వం తాజాగా హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్ (HZL) కంపెనీలో తనకు ఉన్న వాటాను అమ్మాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో దీనికి ఆమోద ముద్ర వేశారు. హిందుస్థాన్‌ జింక్‌లో ఇప్పటికే ప్రభుత్వం మెజారిటీ వాటా అమ్మేసింది. 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం 26శాతం వాటాను అమ్మేసింది. దీన్ని వేదాంత గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఇందులో కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కొహ్లిలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్‌ ఇటీవల తీర్పు ఇచ్చింది. అయితే కంపెనీలో ఉన్న మిగతా వాటా కేంద్రం అమ్ముకోవచ్చని పేర్కొంది. ఇపుడు కేంద్రానికి ఆ కంపెనీలో 29.5 శాతం వాటా ఉంది. మొన్నటి దాకా ఈ వాటా విలువ రూ. 45,000 కోట్లుగా ఉండేది. ఇటీవల షేర్‌ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో ఇపుడు అమ్మితే రూ. 38,000 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేతిలో ఉన్న ఈక్విటీ ఇపుడు మార్కెట్‌లోకి రానుంది. మరి ఈ వాటాను ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా అమ్ముతారా? లేదా వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు అమ్ముతారా అన్నది చూడాలి.