For Money

Business News

ట్యూషన్‌ సెంటర్లపై రూ. 1,500 కోట్లు

దేశ వ్యాప్తంగా 200 కేంద్రాలలో 500 ట్యూషన్‌ సెంటర్లను నెలకొల్పాలని ఎడ్యుటెక్‌ సంస్థ బైజుస్‌ నిర్ణయించింది. దీని కోసం 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,500 కోట్లు) పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మరినాల్‌ మోహిత్‌ తెలిపారు. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు కింద 80 సెంటర్లను ప్రారంభించామని, వీటికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా నాలుగు నుంచి 10వ తరగతి విద్యార్థులుకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్లో కాస్‌లను ఈ సెంటర్ల నుంచి ఆఫర్‌ చేస్తున్నామన్నారు. అలాగే వచ్చే రెండేండ్లలో 10 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందించడంతోపాటు 10 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.