బైజూస్ చేతికి గ్రేట్ టర్నింగ్
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేట్ లర్నింగ్ కంపనీని బైజూస్ టేకోవర్ చేసింది. ప్రొఫెషనల్, హయ్యర్ ఎడ్యుకేషన్ రంగంలో నిమగ్నమైన గ్రేట్ లర్నింగ్ కంపెనీని 60 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. టేకోవర్ చేసిన ఈ కంపెనీని మరింత అభివృద్ధి చేసేందుకు మరో 40 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు బైజూస్ వెల్లడించింది. టేకోవర్ చేసిన తరవాత కూడా గ్రేట్ లర్నింగ్ స్వతంత్ర సంస్థగానే కొనసాగుతుంది.