అప్పటి దాకా షార్ట్ చేయొద్దు అమ్మండి
మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఉన్నా నిఫ్టి 17430 దిగువకు వచ్చే వరకు షార్ట్ చేయొద్దని ప్రముఖ డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ నిఫ్టికి 17527 లేదా 17460 ప్రాంతంలో మద్దతు రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ స్థాయిలను కూడా కోల్పోతే నిఫ్టి 17423 వద్ద మద్దతు ఉందని ఆయన అన్నారు. అయితే 17430 దిగువకు వెళితే మాత్రం సెంటిమెంట్ బలహీనపడుతుందని ఆయన అన్నారు. కీలక స్థాయిలను గమనించి .. పడితే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన సలహా ఇస్తున్నారు. ప్రస్తుత స్థాయిలో నిఫ్టిని అమ్మడం కంటే దిగువ స్థాయిలో కొనుగోలు చేయడం మంచిదని ఆయన సూచించారు.
(ఈ రివ్యూకు సంబంధించిన వీడియోను వెబ్‌సైట్ దిగువన చూడగలరు)