NIFTY TRADE: పడితే కొనండి కానీ…
నిఫ్టి రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. పొజిషనల్ ట్రేడర్స్‌కు మంచి లాభాలు అందుతున్నాయి. ఐటీ, రియాల్టీ షేర్లలో వస్తున్న భారీ కొనుగోళ్ళ కారణంగా నిఫ్టి 16000 స్థాయిని చాలా త్వరగానే అందుకోనుంది. అయితే రియాల్టీ విషయంలో ఓ ప్రమాదముంది. గత ఏడాది ఏమీ లేదు కాబట్టి..ఈ ఏడాది ఏ కాస్త అమ్మకాలు జరిగినా… అద్భుతమని వార్తలు వస్తున్నాయి. ఈ షేర్లు ఇప్పటికే పెరిగాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచింది. నెలల నుంచి పొజిషన్స్ ఉన్నవారికి మంచి లాభాలు వస్తున్నాయి. దాన్ని చూసి ఇపుడు కొత్తగా మార్కెట్లో దిగొద్దు. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉంది. రిస్క్ తీసుకునేవారు, లిక్విడిటీ ఉన్నవారు… టెక్నికల్స్ తెలిసినవారు మాత్రమే డే ట్రేడింగ్ కాస్త లాభాలు సంపాదిస్తున్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 15,924. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయి లాభాలతో నిఫ్టి ప్రారంభమౌతుందని అనుకుంటే… నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయిలో ప్రారంభమౌతుందన్నమాట. నిఫ్టికి ఇవాళ తొలి ప్రతిఘటన 15960-15975 మధ్య ఎదురు కానుంది. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ స్థాయికి వస్తే నిఫ్టిని 16,000 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. 16,000 దాటితే నిఫ్టి షార్ట్ చేయొద్దు. రిస్క్ తీసుకునేవారు 15,960 ప్రాంతంలోనే షార్ట్ చేయొచ్చు. కాని స్వల్ప లాభాలతో బయటపడండి. నిఫ్టికిఇవాళ కీలక స్థాయి 15,910.ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టికి ఢోకా లేదు. ఇకవేళ తగ్గితే నిఫ్టి 15880ని తాకే అవకాశముంది. ఈ స్థాయికి వస్తే 15,860-15,870 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. రిస్క్తీసుకునేవారు 15,880 వద్దే కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి రేంజ్ 15,870 నుంచి 15,980 ఈ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయండి. సింపుల్ లాజిక్. సపోర్ట్ లేదా రిసిస్టెన్స్ లెవల్స్‌కు నిఫ్టి వచ్చినపుడు పొజిషన్ తీసుకుని…స్వల్ప లాభంతో బయటపడండి.