NIFTY TRADE: తొలి డిప్ కొనండి
మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల ఒత్తిడి తగ్గింది. కేవలం నామమాత్రపు అమ్మకాలు వస్తున్నాయి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి. స్టాక్ ఫ్యూచర్స్‌లో ఇప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా ఉన్నారు. నిఫ్టి 17060దాకా వెళ్ళే అవకాశముందని అంటున్నారు డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్. మార్కెట్లో గనుక డిప్ వస్తే కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. దీని కోసం ఆయన బేస్ లెవల్స్ ఇచ్చారు. మార్కెట్‌కు ఇవాళ తొలి మద్దతు 16809 లేదా 16765 వద్ద వస్తుందని ఆయన అంచనా. లేదంటే నిఫ్టి 16717 లేదా 16667ని కూడా తాకొచ్చు. ఇక పెరిగితే తొలి ప్రతిఘటన 16936 లేదా 16977 వద్ద ఎదురు కావొచ్చు. ఈ స్థాయిలను దాటితే 17024, ఆ తరవాత 50 DEMA (Daily Exponential Moving Average) అయిన 17067ని చేరే అవకాశముందని అంటున్నారు. బ్యాంక్ నిఫ్టితో పాటు ఇతర డేటా కోసం దిగువ ఇచ్చిన వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=21FEixH4gyc