HOT STOCKS: మూడు వారాల కోసం
రెండు లేదా మూడు వారాల కోసం మూడు షేర్లను హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సిఫారసు చేస్తోంది. మనీ కంట్రోల్ డాట్ కామ్ పాఠకుల కోసం ఈ కంపెనీ రీసెర్చి అనలిస్ట్ వినయ్ రజని ఈ షేర్లను సిఫారసు చేశారు. విప్రో షేర్ ఇపుడు రూ. 598 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ షేర్‌ను రూ. 645 టార్గెట్ కోసం రూ.570 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేస్తున్నారు. కీలకమైన 50 EMAతో పాటు డైలీ చార్ట్స్‌పై ప్రతిఘటన స్థాయి రూ. 590ని ఈ షేర్ దాటిందని ఆయన అంటున్నారు. ఐనాక్స్ లీజర్ షేర్‌ను రూ. 395 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని లక్ష్యం రూ. 530గా పేర్కొన్నారు. ఈ షేర్ ఇపుడు రూ.435 ప్రాంతంలో ఉంది. అన్ని రకాల టైమ్ ఫ్రేమ్స్‌లో ఈ షేర్ అప్‌ట్రెండ్ చూపిస్తోంది. అన్ని ప్రధాన మూవింగ్ యావరేజస్పైన ఈ షేర్ ట్రేడ్ అవుతోందని వినయ్ అంటున్నారు. ఆయన సూచించిన మరో షేర్ అంబర్ ఎంటర్‌ప్రైజస్. ఈ షేర్ ప్రస్తుతం రూ. 3692 వద్ద ట్రేడవుతోంది. రూ. 3400 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను రూ.4150 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.