ఇవాళే లిస్టయింది… కొనండి
ఎలక్ట్రో ఫోర్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. గత వారం ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌తో ప్రైమరీ మార్కెట్లోకి వచ్చింది. ఒక్కో షేర్‌ను రూ. 93లకు ఆఫర్ చేసింది. ఇవాళ ఉదయం రూ. 100 వద్ద లిస్టయినా.. తరవాత తగ్గి రూ. 95.10కి.. చాలా సేపు దిగువనే ఉంది. అయితే మిడ్ సెషన్లో కొందరు అనలిస్టులు ఈ షేర్‌ను రెకమెండ్ చేయడంతో షేర్ రూ. 105 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద అమ్మకందారులు లేరు. ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ ఇవాళ రెకమెండ్ చేశారు. (ట్రేడింగ్ సమయంలో). గత ఏడాది ఈ కంపెనీ రూ. 80 కోట్ల టర్నోవర్‌పై రూ. 15 కోట్ల నికర లాభం ఆర్జించిందని.. ఈ ఏడాది రూ. 150 కోట్ల టర్నోవర్‌పై రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని ఆయన అంచనా వేశారు. కంపెనీకి సీమన్స్, ష్నెడర్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ప్రొటొటైపింగ్, ప్రనెసిషన్ మెటల్ స్టాంపింగ్, టూల్ డిజైనింగ్‌తో పాటు పలు రకాల మౌల్డింగ్ పనులను ఈ కంపెనీ చేస్తోందని భాసిన్ అన్నారు. ఈ రంగలోని టాప్ కంపెనీల షేర్లు 35 నుంచి 45 రెట్ల పీఈతో ట్రేడవుతున్నాయని అన్నారు. ఎలక్ట్రో ఫోర్స్ 25 రెట్లకే లభిస్తోందని.. ఏడాదిలో ఈ షేర్ రెట్టింపు అవుతుందని ఆయన సలహా ఇచ్చారు.పబ్లిక్ ఆఫర్ ద్వారా వచ్చిన రూ. 70 కోట్లలో రూ. 15 కోట్ల ప్రమోటర్లకు (ఈక్విటీ అమ్మకం ద్వారా) పోగా మిగిలిన రూ.55 కోట్లను వ్యాపారంపై కంపెనీ పెడుతోందని అన్నారు. కంపెనీ మెషినరీ మొత్తంపై తరుగుదలను పరిగణనలోకి తీసుకున్నారని… అలాగే కంపెనీకి ఎలాంటి రుణాలు లేవని భాసిన్ చెప్పారు. చక్కటి ఆర్డర్ బుక్ ఉన్న ఈ కంపెనీ బాగా రాణిస్తుందని భాసిన్ అన్నారు.