For Money

Business News

NIFTY TRADE: షార్ట్‌ చేయొద్దు

ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నారు. VIX 22 దాటితేనే షార్ట్‌ చేసే అంశాలను పరిశీలించాలని.. అప్పటి వరకు నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌ మార్కెట్‌లో అమ్మగా, అంతకుమించి దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. అయితే ఆప్షన్స్‌ విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేశారు. 16900 ప్రాంతంలో షార్ట్‌ రైటింగ్‌ అధికంగా ఉందని అంటున్నారు. నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. అయితే మార్కెట్‌ నుంచి ఇంకా గట్టి సంకేతాలు రానందున.. భారీ పొజిషన్స్‌ తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. పైనా 17173 నుంచి 17210 దిగువన 17008-16961 మధ్య నిఫ్టి ట్రేడ్‌కు ఆస్కారం ఉందని ఆయన అంటున్నారు. సో.. నిఫ్టి పడితే దిగువ రేంజ్‌లో కొనుగోలు చేయమని ఆయన చెబుతున్నారు. ప్రతిఘటన స్థాయిలు… 17105, 17173, 17210. 17247, 17267. ఇక దిగువ స్థాయిలో మద్దతు స్థాయిలు.. 17008, 16961, 16917, 16863. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌, ఇతర వివరాలకు దిగువ వీడియో చూడండి.