For Money

Business News

NIFTY TRADE: 16868 దాటితేనే

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మాలను దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు తట్టుకోలేకపోతున్నారు. నిన్న కూడా రూ. 3288 కోట్ల అమ్మకాలను విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌ మార్కెట్‌లో చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1338 కోట్లకు మించి కొనలేకపోయారు. అలాగే ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో రూ. 2848 అమ్మకాలు చేశారు విదేశీ ఇన్వెస్టర్లు. ఈ నేపథ్యంలో నిఫ్టి 16868 దాటే వరకు ఇన్వస్టర్లు సెల్‌ ఆన్‌ రైజ్‌ ఫార్ములాను పాటించవచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. ఈ స్థాయి దాటితే నిఫ్టి 16936. ఆ తరవాత 17010 స్థాయిని దాటే అవకాశముందని అంటున్నారు. డెరివేటివ్స్‌ వీక్లీ క్లోజింగ్‌ ఉన్నందున తక్కువ పరిమాణంలో ట్రేడ్‌ చేయాల్సిందిగా ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు. నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి పూర్తి లెవల్స్‌కు వీడియోలు చూడగలరు.