For Money

Business News

స్వల్ప కాలానికి… స్టార్‌ పేపర్‌

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ విజయ్‌ చోప్రా మూడు రకాల షేర్లను సిఫారసు చేస్తున్నారు. జీ బిజినెస్‌ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ స్వల్ప కాలానికి స్టార్‌ పేపర్‌ను రెకమండ్‌ చేశారు. యూరప్‌ కాగితం తయారీ పరిశ్రమ చాలా వరకు గ్యాస్‌ ఆధారిత పరిశ్రమ అని… అక్కడ గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడంతో స్టార్‌ పేపర్‌ షేర్‌ మరింత పెరిగే అవకాశముందని ఆయన సలహా ఇస్తున్నారు. స్టార్‌ పేపర్‌ ఇవాళ 4 శాతంపైగా లాభంతో రూ. 145 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ కేవలం ఒకటి లేదా మూడు నెలల్లో రూ. 180లకు చేరుతుందని ఆయన సలహా ఇస్తున్నారు. ఒక పొజిషనల్‌ ట్రేడింగ్‌ అంటే… మూడు నుంచి ఆరు నెలల కోసం టాటా కాఫీ షేర్‌ను ఆయన రెకమెండ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కాఫీ పంట దెబ్బతిందని, ముఖ్యంగా బ్రెజిల్‌ కూడా పంట దిగుబడి అధికంగా ఉందని ఆయన అంటున్నారు. ఇపుడు రూ. 202 వద్ద ఉన్న ఈ షేర్‌ మూడు లేదా ఆరు నెలల్లోగా రూ. 230 లేదా రూ. 246లకు చేరుతుందని ఆయన రెకమెండ్‌ చేశారు. ఇక దీర్ఘకాలానికి టాటా మోటార్స్‌ డీవీఆర్‌లను విజయ్‌ చోప్రా రెకమెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రూ. 209.95 వద్ద ఉన్న ఈ షేర్‌ 9 నుంచి 12 నెలల్లోగా రూ. 300లకు చేరుతుందని ఆయన అంటున్నారు. ఈ షేర్లకు సంబంధించి మరింత వివరణాత్మక విషయాలు కోసం కింద వీడియో చూడండి.