ఎవరెడీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్
ఎవరెడీ ఇండస్ట్రీస్ వాటారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు డాబర్ కంపెనీ ప్రమోటర్లు. ఎవరెడీ ఈక్విటిలో ఇప్పటికే 25.11% వాటా కొనుగోలు చేసిన డాబర్ ఇండియా ప్రమోటర్లు ‘బర్మన్’ కుటుంబం మరో 26% షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.320కి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఎవరెడీ కంపెనీ ప్రస్తుతం బీఎం ఖైతాన్ గ్రూప్ చేతిలో ఉంది. కంపెనీ ఈక్విటీలో ప్రస్తుతం వీరి వాటా 4.84% పడిపోయింది. కంపెనీ షేర్లను ఖైతాన్ గ్రూప్ తాకట్టు పెట్టింది. సకాలంలో సొమ్ము చెల్లించకపోవడంతో ఆ షేర్లు అమ్మకానికి వచ్చాయి. తన అనుబంధ సంస్థలు మెక్లియో రస్సెల్. మెక్నలి భారత్ ఇంజినీరింగ్ రుణాల కోసం కూడా ఎవరెడీ షేర్లను తాకట్టు పెట్టారు. షేర్లను విడిపించుకోవడంలో విఫలం కావడంతో ఖైతాన్ గ్రూప్ చేతి నుంచి ఎవరెడీ చేజారిపోయింది. 26 శాతం ఓపెన్ ఆఫర్ కింద మార్కెట్ నుంచి 1.89 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు డాబర్ రెడీ అయింది. దీనికి కోసం రూ. 604.76 కోట్లు అవుతాయని అంచనా. ఓపెన్ ఆఫర్ ప్రకటన రావడంతో ఎవరెడీ షేర్ నిన్న రూ. 340 నుంచి రూ. 375కు పెరిగింది. అంటే పది శాతం లాభంతో క్లోజైంది.