మెరిసిన వెండి, బంగారం
ఈ వారం అమెరికాలో జాబ్‌లెస్ క్లయిమ్స్ పెరిగాయి. అంటే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు పెరిగాయన్నమాట. దీంతో డాలర్ స్వల్పంగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 0.17 శాతం మాత్రమే తగ్గినా… బులియన్ భారీగా పెరిగింది. వెండి దాదాపు మూడు శాతం పెరగ్గా, బంగారం రెండున్నర శాతం పెరిగింది. ఇవి రెండూ పెరిగి.. డాలర్ తగ్గితే మన మార్కెట్లో ధరలు బాగా పెరుగుతాయి. దీంతో ఎంసీఎక్స్‌లో డిసెంబర్ కాంట్రాక్ట్ స్టాండర్డ్ బంగారం రూ. 866 పెరిగి రూ. 46635 వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి కూడా రూ.1,220 పెరిగి రూ. 5,982కు చేరింది. స్పాట్ మార్కెట్లో స్టాండర్డ్ బంగారం హైదరాబాద్‌లో రూ. 47130, 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.43,200 వద్ద ముగిశాయి.