For Money

Business News

భారీ నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

నిన్న కాస్త గాలి పీల్చుకున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఇవాళ మళ్ళీ తమ పతన బాటను కొనసాగించాయి. ఆరంభంలో కాస్త గ్రీన్‌లో ఉన్న సూచీలు నష్టాల బాట పట్టాయి.ముఖ్యంగా నాస్‌డాక్‌ గ్రీన్‌ నుంచి రెడ్‌లోకి రావడం భారత్‌ వంటి మార్కెట్లకు రెడ్‌ సిగ్నల్‌. ఇక డౌజోన్స్‌ ఏకంగా 1.23 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.77 శాతం నష్టంతో సాగుతోంది. సెషన్‌ చివరికల్లా మార్కెట్‌లో కోలుకోని పక్షంలో ప్రపంచ మార్కెట్లలో ఒక మోస్తరు కరెక్షన్‌ రావడం ఖాయంగా కన్పిస్తోంది. డాలర్‌ ఇవాళ స్వల్పంగా తగ్గినా.. ఇపుడు క్రితం స్థాయికి వచ్చేసింది. నిన్న అమెరికా మార్కెట్‌లో వారాంతపు క్రూడ్‌ నిల్వలు అంచనాలకు మించి పెరిగినా… పడాల్సిన క్రూడ్‌ తగ్గకపోగా. ఇవాళ మరో 1 శాతం పైగా పెరిగింది. ఈ లెక్కన చూస్తే క్రూడ్‌ ఏడాదిలోగా 90 డాలర్లు చేరడం పెద్ద కష్టం కాదనిపిస్తోంది. ఇవాళ ఇప్పటికే 79 డాలర్లను దాటింది. ఇక బులియన్‌లో బంగారానికి 1736 వద్ద గట్టి మద్దతు లభించింది. దీంతో ఇపుడు 1759డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిన్న 4 శాతం పెరిగిన వెండి ఇవాళ మూడు శాతం రికవరీతో సాగుతోంది.