దిమ్మతిరిగేలా బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో మెటల్స్ భారీగా పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో డాలర్ స్థిరంగా ఉంది. వాస్తవానికి డాలక్ ఇండెక్స్ 0.17 శాతం తగ్గింది.అయినా డాలర్ ఇండెక్స్ 99పైనే ఉంది. కాని రష్యా క్రూడ్ ఆయిల్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తుందని వార్తలు వస్తుండటంతో జనం షేర్లు, ఇతర సాధనాల నుంచి బంగారానికి తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. ఇవాళ అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2066 డాలర్లకు చేరింది. దీంతో మన ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర రూ.1740 పెరిగి రూ. 55,257 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి కూడా ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ. 2237 పెరిగి రూ.72,317కు చేరింది. రేపు స్పాట్ మార్కెట్లో బంగారం ధర మరింత పెరుగుతుందేమో చూడాలి.