భారీగా పెరిగిన బులియన్ ధరలు
కరోనా నుంచి చైనా కోలుకుంటున్నట్లు వస్తున్న వార్తలతో కమాడిటీ మార్కెట్లో జోష్ పెరిగింది. మెటల్స్‌తో పాటు బులియన్ ధరలు గత శుక్రవారం నుంచి భారీగా పెరిగాయి. డాలర్ అయిదు నెలల కనిష్టానికి పడటంతో ఆటోమేటిగ్గా మెటల్స్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా చైనాలో ఆర్థిక కార్యకలాపాలు మళ్ళీ మొదటికి వస్తాయన్న అంచనాలతో మెటల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇవాళ అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ఫ్యూచర్స్ 1822 డాలర్లను తాకింది. అలాగే ఔన్స్ వెండి ధర23.68 డాలర్లకు చేరింది. అదే మన దేశంలో ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్స్‌లో ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర రూ.380 పెరిగి రూ.54228ని తాకింది. అలాగే వెండి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర రూ. 970 పెరిగి రూ. 67381కి చేరింది.