నష్టాల్లోనే బంగారం, వెండి
అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటంతో బులియన్ రేట్లు డల్‌గా ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన బులియన్లో ఇవాళ పెద్దగా మార్పు లేకున్నా… కీలక స్థాయిల వద్ద పరీక్షిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఇపుడు బంగారం కొనాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,752 డాలర్ల వద్ద ఉంది. 1750 డాలర్లు కీలక స్థాయి. ఈ స్థాయి దిగువకు వస్తే వెంటనే 1,736 డాలర్లకి వస్తుందని అంచనా. ఇక ఫ్యూచర్స్ మార్కెట్లో ఎంసీఎక్స్‌లో బంగారం అక్టోబర్ డెలివరి కాంట్రాక్ట్ స్వల్పంగా అంటే రూ.84 తగ్గి రూ. 45,972 వద్ద ఉంది. ఇక వెండి కూడా రూ. రూ. 169 తగ్గి రూ.60,600 వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ మార్కెట్లో హైదరాబాద్‌లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.46,108 కాగా, నగల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,865.