రూ. 7 లక్షల కోట్ల సంపద డౌన్
ఒకే ఒక్క రోజులు భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ. 7 లక్షల కోట్లు తగ్గింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ద్రవ్యోల్బణం ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడుతోంది. వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు బాండ్లు, కరెన్సీలు కొనుగోలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్ల సంపద బాగా తగ్గింది. ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ. 5.47 లక్షల కోట్లు తగ్గింది. నిన్న బీఎస్ఈలోని షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 251.8 లక్షల కోట్లు ఉండగా, ఇవాళ రూ. 246 లక్షల కోట్లకు పడిపోయింది. మే 30వ తేదీ నుంచి ఇన్వెస్టర్ల సంపద రూ. 13.6 లక్షల కోట్లు తగ్గింది.