For Money

Business News

అదే స్థాయి పతనం మళ్ళీ

వాల్‌స్ట్రీట్‌లో మళ్ళీ అదే తరహా పతనం మొదలైంది. గత శుక్రవారం మూడున్నర శాతం క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ కూడా మరో 3.58 శాతం నష్టపోయింది. యాపిల్‌ నుంచి అమెజాన్‌ వరకు అనేక టెక్‌, ఐటీ షేర్లు రెండున్నర నుంచి ఆరు శాతం వరకు నష్టపోయాయి. దీంతో కేవలం రెండు సెషన్స్‌లో నాస్‌డాక్‌ ఏడు శాతం క్షీణించింది. డౌజోన్స్‌ కూడా గత శుక్రవారం రెండు శాతం, ఇవాళ మరో రెండు శాతం క్షీణించింది. ఎస్‌ అండ్‌ పీ ఇవాళ కూడా 2.5 శాతం క్షీణించడంతో… ఈసూచీ కూడా గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం క్షీణంచి బేర్‌ ఫేజ్‌లోకి ఎంటర్‌ అయింది. డాలర్‌ ఇవాళ కూడా 0.67 శాతం పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 104.7కు చేరింది. క్రూడ్‌ ధరలు కూడా పెరగడం విశేషం. బ్రెంట్‌ క్రూడ్‌ 123 డాలర్లను దాటింది.