7 సెషన్స్‌లో… రూ.19 లక్షల కోట్లు పాయే…
డిసెంబర్ 14న నిఫ్టి 18,696ని తాకింది. ఆ రోజు బీఎస్ఈలో షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 291.25 లక్షల కోట్లు. ఆ తరవాత 16వ తేదీ మినహా మిగిలిన ఆరు సెషన్స్‌లో నిఫ్టి నష్టాలతో ముగిసింది. కేవలం ఈ ఏడు సెషన్స్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ. 272.12 లక్షల కోట్లు. అంటే 19.3 లక్షల కోట్లు తగ్గిందన్నమాట. వాస్తవానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ ఇంట్రా డేలో 59,765ను తాకి… 59845 వద్ద ముగిసింది. లేకుంటే విలువ ఇంకా బాగా తగ్గేది. సెన్సెక్స్ ఇవాళ మళ్ళీ 60,000 దిగువకు వచ్చింది. ఈ ఒక్క రోజే బీఎస్ఈ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 280.55 లక్షల కోట్ల నుంచి 272.12 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ. 8.43 లక్షల కోట్లు తగ్గింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం రావడం తథ్యమని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కరోనా భయాలు కూడా చట్టుముట్టడంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి బలహీనపడటంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ బాగా పడిపోతోంది. దీంతో అయినకాటికి వారు అమ్మేస్తున్నారు. గత మూడేళ్ళు నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు ఇప్పటి వరకు లక్ష కోట్లకుపైగా పెట్టుబడులను ఉపసంహరించినట్లు తెలుస్తోంది.