For Money

Business News

అందరి నోటా… ఈ షేర్‌ను కొనండి

గతవారం ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుత ఫలితాలను అందింది. గత కొన్ని నెలల నుంచి ఈ బ్యాంక్‌ షేర్‌ను అనేక మంది అనలిస్టులు సిఫారసు చేశారు. తాజా ఫలితాల తరవాత అనేక బ్రోకరింగ్‌ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటింగ్‌తో పాటు టార్గెట్ ధరను కూడా పెంచాయి. మరో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కానుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ షేర్‌పై వివిధ బ్రోకింగ్‌ సంస్థలు తాజా కామెంట్స్‌ ఇవి…

ఈ బ్యాంక్‌ షేర్‌ బాగా రాణిస్తుందని బెర్న్‌స్టయిన్‌ బ్రోకరేజీ సంస్థ అంటోంది.ఈ సంస్థ షేర్‌ ధర టార్గెట్‌ను రూ.790గా పేర్కొంది. రిటైల్‌తో పాటు డిజిటల్‌ రంగంలో ఈ బ్యాంక్‌ రాణిస్తోందని పేర్కొంది.
– సీఎల్‌ఎస్‌ఏ బ్రోకింగ్‌ సంస్థ ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 1040గా పేర్కొంది. మార్జిన్స్‌ స్థిరంగా ఉండటం, ఈల్డ్స్‌ పెరుగుతున్నందున NIM మరింత పెరగొచ్చని అటోంది. నెట్‌ జీరో క్రెడిట్ కాస్ట్‌ రంగంలో ఈ బ్యాంక్‌ బాగా రాణిస్తోందని పేర్కొంది. బ్యాంక్‌ పనితీరు చాలా స్థిరంగా ముందుకు సాగుతోందని సీఎల్‌ఎస్‌ఏ అంటోంది.
– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ కూడా ఈ బ్యాంక్‌ షేర్‌ టార్గెట్‌ను రూ. 1000గా పేర్కొంది. ప్రి ప్రొవిజన్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ (పీపీఓపీ) చక్కగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో రాణించేందుకు బ్యాంక్‌ సిద్ధంగా ఉందని, రుణ వృద్ధి బాగా ఉందని పేర్కొంది.
– జెఫరీస్‌ కూడా ఈ బ్యాంక్‌ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా రెకమెండ్‌ చేస్తోంది… ఈ సంస్థ ఇచ్చిన టార్గెట్‌ రూ. 800. నిమ్స్‌ అద్భుతంగా ఉన్నాయని.. రుణాల కూడా బాగా వృద్ధి చెందుతున్నట్లు జెఫరీస్‌ పేర్కొంది. తమ టాప్‌ పిక్స్‌లో ఈ బ్యాంక్‌ షేర్‌ ఉందని తెలిపింది.