For Money

Business News

బ్రోకరేజ్‌ రిపోర్ట్స్‌…

జెఫరీస్‌ రెండు కంపెనీలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. HEG షేర్‌ను రూ. 1760 టార్గెట్‌గా పేర్కొంది. అలాగే గ్రాఫైట్‌ ఇండియా షేర్‌ టార్గెట్‌ రూ. 530గా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రోడ్‌ ధరలు మళ్ళీ పెరగడం, అలాగే యూరప్‌లో ఇంధన ధరలు భారీగా ఉండటం కారణంగా జెఫరీస్‌ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎస్‌ను 4 నుంచి 7 శాతాన్ని తగ్గించినా.. కొనుగోలుకు రెకమెండ్‌ చేసింది.
గ్లాండ్‌ ఫార్మా షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా బ్యాంక్ ఆఫ్‌ అమెరికా సలహా ఇచ్చింది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 3200గా పేర్కొంది. ఎగుమతి డేటా చూస్తుంటే రికవరీ వస్తున్నట్లు తెలుస్తోందని… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రన్‌ రేట్‌ సాధారణ స్థాయికి వస్తుందని అంచనా వేస్తోంది.
జెఫెరీస్‌ టీవీఎస్‌పై కూడా తన టార్గెట్‌ను కొనసాగించింది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 1450గా పేర్కొంది. కంపెనీ EBITDA పెరుగుతోందని, ప్రధాన కంపెనీలకు, ఈ కంపెనీకి మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గుతోందని జెఫరీస్‌ పేర్కొంది.
బ్రిటానియా షేర్‌పై జేపీ మోర్గాన్‌ న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 3930గా పేర్కొంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ 4 శాతం నుంచి 2 శాతం తగ్గే అవకాశముందని పేర్కొంది. గ్రాస్‌ మార్జిన్స్‌ పెరిగిందని, కంపెనీ కూడా వివిధ రకాల ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లోకి తెస్తోందని పేర్కొంది.