For Money

Business News

సియంట్‌, HUL‌లపై బ్రోకరేజ్‌ రిపోర్ట్‌లు

హైదరాబాద్‌కు చెందిన సియంట్ కంపెనీ షేర్‌ను నెగిటివ్‌ రిపోర్ట్‌ ఇస్తోంది మోర్గాన్‌ స్టాన్లీ. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సియంట్‌ కంపెనీ రెవెన్యూ పరంగా విఫలమైందని పేర్కొంది. మార్జిన్స్‌ కూడా మున్ముందు కొనసాగడం కష్టమని చెప్పిన మోర్గాన్‌ స్టాన్లీ.. ఈ షేర్‌ను రూ. 900 టార్గెట్‌ కోసం సెల్‌ సిగ్నల్‌ ఇస్తోంది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ.976 వద్ద ట్రేడవుతోంది.
హిందుస్థాన్‌ లీవర్‌ షేర్‌కు సంబంధించి దాదాపు అన్ని బ్రోకరేజీ సంస్థలు బై సిగ్నల్‌ ఇచ్చాయి. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 2262 వద్ద ట్రేడవుతోంది. జెఫెరీస్‌ టార్గెట్‌ రూ. 2900. సీఎల్‌ఎస్‌ఏ కూడా ఈ షేర్‌ను ఔట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ సంస్థ మాత్రం షేర్‌ టార్గెట్‌ను రూ. 2725గా పేర్కొంది. సీఎస్‌ కూడా ఇదే తరహా టార్గెట్‌ను ఇచ్చింది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ షేర్‌ రూ.2800లకు చేరనుంది. మోర్గాన్‌ స్టాన్లీ కూడా ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 2766గా పేర్కొంది.