For Money

Business News

AIRTEL, MAX FIN: ఈ రెండు షేర్ల టార్గెట్‌ ఎంత?

భారతీ ఎయిర్‌టెల్‌, మ్యాక్స్ ఫైనాన్షియల్స్‌పై బ్రోకరేజీ సంస్థలు తమ నివేదికలను విడుదల చేశాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇపుడు రూ.733 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 900లకు పెంచింది క్రెడిట్ సూసె. దేశంలో ఇంటిగ్రేటెడ్‌ కంపెనీగా రాణించడానికి ఈ కంపెని సర్వ సన్నద్ధంగా ఉందని ఈ సంస్థ అభిప్రాయపడింది. 2025 వరకు ఈ కంపెనీ 25 శాతం CAGR -(Compound annual growth rate) సాధించే వీలు ఉందని పేర్కొంది. ఇక మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ షేర్‌ ఇపుడు రూ. 703 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీపై సీఎల్‌ఎస్‌ఏ సంస్థ తన రీసెర్చి రిపోర్ట్‌ విడుదల చేస్తూ షేర్‌ టార్గెట్‌ను రూ. 1030గా కొనసాగిస్తోంది. బజాజ్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌ ఒప్పందం ప్రభావం మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌పై ఉంటుందని పేర్కొంది. మ్యాక్స్‌ గ్రూప్‌తో ఒప్పందం కారణంగా యాక్సిస్‌ బిజినెస్ వాల్యూమ్‌లో ప్రధాన వాటా ఈ కంపెనీకి వస్తుందని అంటోంది. ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీపై తలెత్తిన వివాదం నుంచి గ్రూప్‌ కంపెనీలను దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోంది. వ్యాల్యూయేషన్‌ పెరుగుతుందని సీఎల్ఎస్‌ఏ పేర్కొంది.