భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు
గత కొన్ని రోజుల నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. అమెరికాలో చమురు నిల్వలు ఊహించినదానికన్నా ఎక్కువగా ఉండటం, రిజర్వులో ఉన్న క్రూడ్‌ను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమెరికాలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. దీంతో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా క్షీణించాయి. ఇటీవలి కాలంలో బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లకు చేరగా, ఇవాళ 80 డాలర్ల దిగువకు తగ్గాయి. డాలరు్ బలపడటం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. మరోవైపు రాత్రి నష్టాల్లో ముగిసింది. ముఖ్యంగా డౌజోన్స్ అర శాతంపైగా నష్టంతో ముగిసింది. డాలర్ ఇండెక్స్ కూడా స్వల్పంగా తగ్గి 95.72కి చేరింది.