గ్రీన్‌లోనే అమెరికా ఫ్యూచర్స్
మెమోరియల్ డే సందర్భంగా ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్ మార్కెట్లు మాత్రం గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.ఎస్ అండ్ పీ 500 సూచీ అరశాతం పైగా లాభంతో ఉన్నాయి. అంతక్రితం యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 0.72 శాతం లాభంతో ముగిసింది. మరోవైపు క్రూడ్ ఆయిల్ 120 డాలర్లను దాటింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై మరోసారి ఆంక్షలు విధించాలని కొన్ని యూరప్ దేశాలు ప్రతిపాదించాయి. దీనిపై యూరప్ దేశాల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గురువారం ఒపెక్ దేశాలు భేటీ అవుతన్నాయి. తాము ఇంతకుముందు హామి ఇచ్చినట్లు జులైలో చమురు సరఫరా పెంచుతామని… ఇప్పటికిపుడు పెంచమని ఒపెక్ దేశాలు పేర్కొన్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర 120.8 డాలర్లను తాకింది. WTI క్రూడ కూడా 116.2 వద్ద ట్రేడవుతోంది.