రిఫైనరీ పనులు షురూ

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 90,000కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఈ రిఫైనరీ తొలిదశ పనులు ప్రారంభించినట్లు బీపీసీఎల్ ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. తొలి దశ కింద రూ. 6100 కోట్లను కంపెనీ వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది. గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కంపెనీ డైరెక్టర్లు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీపీసీఎల్ వెల్లడించింది. ప్రీ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా ప్రాథమిక అధ్యయనం, భూమి గుర్తింపుతో పాటు స్వాధీనం, వివరణాత్మక ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ పనులు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే బేకిస్ డిజైన్ ఇంజినీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ కూడా రెడీ చేయనున్నట్లు బీపీసీఎల్ పేర్కొంది.