NIFTY TODAY: లాభాలు స్వీకరించండి
నిఫ్టిని షార్ట్ చేసినవారు ఇవాళ 17,161 లేదా 17,110 ప్రాంతానికి నిఫ్టి వస్తే…లాభాలు స్వీకరించాల్సిందిగా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్‌లో కేవలం రూ. 101 కోట్ల నికర కొనుగోళ్ళు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మారు. అయితే 17200 వద్ద పుట్ రైటింగ్ 17500 వద్ద కాల్ రైటింగ్ చాలాజోరుగా ఉందని.. కాబట్టి 17200 ప్రాంతంలో నిఫ్టికి గట్టి మద్దతు లభించవచ్చని వీరేందర్ అంటున్నారు. 17110-17161 ప్రాంతంలో లాభాలు స్వీకరించినా… నిఫ్టిని షార్ట్ చేయొద్దని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టి 17000 దిగువకు చేరితేనే నిఫ్టిని షార్ట్ చేయాలన్నారు. నిఫ్టికి 17422 లేదా 17472 వద్ద ప్రతిఘటనలు ఉన్నాయన్నారు. దిగువ స్థాయిలో నిఫ్టికి 17240 లేదా 17190 వద్ద మద్దతు లభిస్తుందని అన్నారు. లేదా 17168 వద్ద లభించవచ్చు.చివరి ఛాన్స్ 17110. బ్యాంక్ నిఫ్టి గురించి వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=PJV-HChWAd8