అదానీ షేర్లను అమ్మండి…
అదానీ గ్రూప్ షేర్లకు సంబంధించి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అదానీ గ్రూప్ షేర్లపై ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. దేశంలో ఏ కంపెనీ షేర్లు కూడా అదానీ గ్రూప్ షేర్ల మాదిరిగా పెరుగుతూ పోలేదని.. ఇది ఆ షేర్లకు ఎంత మాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందుతున్న అదానీ కంపెనీలు ఆ నిధులతో తమ షేర్లను భారీగా పెంచుతున్నారని.. పడితే మాత్రం కొనేదిక్కు ఉండదని ఆయన హెచ్చరించారు. మరో పది శాతం లాభం వస్తుందని ఈ షేర్లలో కొనసాగవద్దని.. పడటం మొదలైతే… భారీ నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సన్ ఫార్మాలో ఇదే తరహా ట్రెండ్ చూశామని… ఒకదశలో సన్ ఫార్మా కంపెనీ యజమాని సంపదలో… ముకేష్ అంబానీని మించిపోయారని.. ఇపుడు ఆ షేర్ పరస్థితి అందరూ చూసిందేనని ఆయన హెచ్చరించారు. అదానీ గ్రూప్ షేర్లు ఎవీ ఉన్నా… అన్నింటి నుంచి బయట పడాలని ఆయన హెచ్చరించారు. అదానీ గ్రూప్ షేర్లు పడితే.. కేవలం ఆ గ్రూప్ కాకుండా… మొత్తం మార్కెట్‌పై దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. అదానీ గ్రూప్ షేర్లను చార్ట్‌లను చూస్తే… తన 25 ఏళ్ళ అనుభవంలో చూస్తే… ఏదైనా కంపెనీ షేర్లు ఇలా పెరిగాయంటే.. కచ్చితంగా షేర్లలో ఏదో ఒక స్కామ్ ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ షేర్లను గురించి హెచ్చరించేందుకే తాను ప్రత్యేకంగా ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రేపు పడటం ప్రారంభమైతే…ఈ షేర్ల ధరలు 25 శాతానికి పడిపోయినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన హెచ్చరించారు. ఈ షేర్ల నుంచి బయటపడమని హెచ్చరించేందుకే ఈ వీడియో చేశానని ఆయన పేర్కొన్నారు.