For Money

Business News

బోనస్‌తో కోలుకునేనా?

ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా మీడియా పిలిచే స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝన్‌ఝున్‌వాలా పెట్టుబడి పెట్టారని జనం పోలోమంటూ ఈ షేర్‌ను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌ను రూ.1100లకు ఈ కంపెనీ షేర్లను ఆఫర్‌ చేసింది. గత ఏడాది మార్చిలో ఈ కంపెనీ షేర్‌ 80 శాతం లాభంతో రూ.1990 వద్ద లిస్టయింది. అక్కడితో ఆగిందా… గత ఏడాది అక్టోబర్‌ 11వ తేదీన ఈ షేర్‌ రూ.3356ని తాకింది. అంతే అక్కడి నుంచి పతనం మొదలైంది. ఇపుడు ఏకంగా 68 శాతం క్షీణించి రూ.1253ని తాకింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 71 శాతం క్షీణించి కేవలం రూ. 4.9 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 6 శాతం క్షీణించి రూ.175.10కోట్లకి పడిపోయింది. మరి ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఒక షేర్‌కు మరో షేర్‌ బోనస్‌గా ప్రకటించింది. దీనివల్ల కంపనీ రిజర్వులు కరిగిపోవడం వినా.. షేర్‌కు అదనంగా ఒరగూరు ప్రయోజనం లేదు.