నికర లాభం 79 శాతం అప్
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,208 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 79 శాతం అధికమని బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వలన బ్యాంక్ లాభాల్లో భారీ వృద్ధి కన్పిస్తోంది. ఇదే కాలంలో బ్యాంక్ ఆదాయం రూ.19,915.83 కోట్ల నుంచి రూ.20,119.52 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.18,937.49 కోట్లకు చేరగా, వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగబాకి రూ.8,838 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం 19 శాతం తగ్గి రూ.5,707 కోట్ల నుంచి రూ.4,528 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ రుణాలు 15.7 శాతం పెరిగి రూ.6,95,493 కోట్లకు చేరుకున్నాయి.