ఏప్రిల్‌లో ఏసీల ధరలు పెరుగుతాయి
రెండేళ్లుగా ఏసీలు అమ్ముడుపోలేదు. 2020, 2021లలో ఎండ తీవ్రత తక్కువగా ఉండటంతో ఏసీల వ్యాపారం చాలా డల్‌గా ముగిసింది.అయితే ఈ ఏడాది వేసవి ఎండల చాలా తీవ్రంగా ఉంటాయని భారత వాతవరణ విభాగం హెచ్చరించింది. దీంతో అన్ని ఏసీ తయారీకంపెనీలు ఈ సీజన్‌పై చాలా ఆశతో ఉన్నాయి. గత ఏడాది మూడుసార్లు ఏసీల ధరలు పెంచామని, అందుకే ఈ సీజన్ ప్రారంభంలో పాత ధరలకే అమ్ముతున్నామని బ్లూస్టార్ కంపెనీ అంటోంది. అయితే ఇటీవల ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయని… దీంతో ఈసారి ఏప్రిల్‌లో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని బ్లూస్టార్ చెబుతోంది. తమకు హిమాచల్ ప్రదేశ్‌లో రెండు యూనిట్లు ఉన్నాయని…నెల్లూరు జిల్లా శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ప్లాంట్‌పై కంపెనీ రూ.550 కోట్లు ఖర్చు పెడుతోంది. మొదటి దశ కింద రూ. 225 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ ఏడాది అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ పేర్కొంది.