జొమాటొ బ్లాక్ డీల్ రేపు
జొమాటొలో రేపు మరో బ్లాక్ డీల్ కుదరనుంది. ఈ డీల్ కింద అలీబాబాకు చెందిన రెండు కంపెనీలు తమ వాటాలో కొంత భాగాన్ని రేపు అమ్మనున్నాయి. యాంట్ ఫైనాన్షియల్, అలిపే కంపెనీలకు జొమాటొలో 13 శాతం వాటా ఉంది. రేపు సమారు 3 శాతం వాటా షేర్లు 20 కోట్ల డాలర్లకు అమ్మనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరకు అయిదు నుంచి ఆరు శాతం డిస్కౌంట్‌కు ఈ షేర్లను అమ్మనున్నాయి. ఈ విక్రయం తరవాత .జొమాటోలో ఆలీబాబాకు 10 శాతం వాటా ఉంటుంది. ఈ ఏడాది జొమాటో షేర్ దాదాపు 55 శాతం క్షీణించింది. ఇవాళ షేర్ రూ. 63.55 వద్ద ముగిసింది. రేపు డీల్ తరవాత షేర్ మరింత క్షీణిస్తుందా లేదా కోలుకుంటుందో చూడాలి. ఎందుకంటే బ్లాక్ డీల్ మార్కెట్ ఓపెనింగ్‌కు ముందే కుదిరితే… షేర్ ధర పెద్దగా క్షీణించకపోవచ్చు.