దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీలు
జనవరి నెలలో దాదాపు 30 శాతం క్షీణించిన క్రిప్టో కరెన్సీలు ఫిబ్రవరి నెలలో దూసుకుపోతున్నాయి. జనవరి మధ్యలో 33000 డాలర్లకు పడిపోయిన బిట్ కాయిన్… నెలాఖరులో 37000 డాలర్లకు, ఇవాళ 43743 డాలర్లకు చేరింది. అంటే కేవలం నెల రోజుల్లో 10,000 డాలర్లకు పైగా పెరిగింది. ఇవాళ బిట్‌కాయిన్ 5 శాతం లాభపడగా, ఎథీరియం కూడా 4 శాతం, బీఎన్బీ 5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. క్రిప్టో మార్కెట్ గత మూడు నెలల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. గత నవంబర్‌లో 3 లక్షల కోట్లు ఉన్న బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి నెలలో 1.3 లక్షల కోట్లకు పడిపోయింది. ఇపుడు మళ్ళీ కోలుకుంటోంది. వీటితో పాటు మీమ్ కాయిన్స్ అయిన డోజికాయిన్, షిబ ఇను కూడా భారీగా లాభపడ్డాయి. గతవారం రోజుల్లో ఇవి 30 శాతం పెరగడం విశేషం.