For Money

Business News

నిరాశపర్చిన టీవీఎస్‌ మోటార్స్‌

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 237 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో నికర లాభః రూ. 290 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,095 కోట్ల నుంచి రూ. 6,597 కోట్లకు పెరిగింది. తాజా త్రైమాసికంలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 9.52 లక్షల యూనిట్ల నుంచి 8.35 లక్షలకు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో ఎగుమతులు 12 శాతం పెరిగాయి.