For Money

Business News

బిల్‌డెస్క్‌ టేకోవర్‌ బిడ్‌ రద్దు

డిజిటల్‌ చెల్లింపుల రంగంలో సేవలు అందిస్తున్న బిల్‌డెస్క్‌ టేకోవర్ కోసం తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నెదర్లాండ్‌కు చెందిన ప్రోసస్‌ ఎన్‌వీ ప్రకటించింది. మరో పేమెంట్‌ కంపెనీ అయిన పేయూ మాతృసంస్థే ప్రోసస్‌ ఎన్‌వి. ఒప్పందం ప్రకారం అనుకున్న గడువులోగా డీల్‌ పూర్తికానుందన.. ఈ ఒప్పందం నుంచి తాము వైదొలగతున్నట్లు నెదర్లాండ్స్‌ కంపెనీ పేర్కొంది. సెప్టెంబరు 30నాటికి ఈ డీల్‌కు భారత నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ఒప్పందానికి గతనెల 5న ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)’ అనుమతి కూడా లభించినట్లు పేర్కొంది. అయితే మిగిలిన లాంఛనాలు పూర్తి కాలేదని ప్రోసెస్‌ ఎన్‌వి పేర్కొంది. బిల్‌డెస్క్‌ను తమ ఫిన్‌టెక్‌ వ్యాపారం సంస్థ పేయూ 470 కోట్ల డాలర్ల (దాదాపు రూ.34,376.2 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు ప్రోసస్‌ ఎన్‌వీ గత ఏడాది ఆగస్టు 31న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెదర్లాండ్స్‌ కంపెనీ భారత్‌లో బైజూస్‌, మీషో, స్విగ్గీ, అర్బన్‌ కంపెనీ వంటి వాటిల్లో 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది.