రిలయన్స్ భారీ బాండ్ ఇష్యూ
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గురువారం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల)ను విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా సమీకరించింది. బాండ్ల ద్వారా ఇంత మొత్తాన్ని భారత కంపెనీ సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నిధులను ప్రస్తుత రుణాలను తీర్చడానికి కంపెనీ ఉపయోగించనుంది. ఫిబ్రవరిలో కట్టాల్సిన 1.5 బిలియన్ డాలర్ల రుణంతో పాటు మరికొన్ని రుణాలను వీటితో తీర్చనుంది. ‘ఇష్యూకు 3 రెట్ల స్పందన వచ్చింది. 1150 కోట్ల డాలర్లకు గిరాకీ లభించింద’ని కంపెనీ పేర్కొంది. 2014లో ఓఎన్జీసీ విదేశ్ అమెరికా డాలర్ల బాండ్లను జారీ చేసి, సమీకరించిన 2.2 బిలియన్ డాలర్లే ఇప్పటిదాకా అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ల లావాదేవీగా ఉంది.