అంచనాలు తప్పిన భారతీ ఎయిర్ టెల్
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాజికంలో భారతీ ఎయిర్ టెల్ రూ. 829.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.854 కోట్లు నికర లాభంతో పోలిస్తే 3 శాతం తగ్గింది. అయితే మొత్తం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ. 26,518 కోట్ల నుంచి రూ. 29,867 కోట్లకు చేరింది. EBITDA కూడా 22.4 శాతం పెరిగి రూ. 14,905 కోట్లకు చేరింది.అయితే కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో రేపు షేర్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. మార్కెట్ అంచనాల ప్రకారం కంపెనీ రూ. 29,801 కోట్ల ఆదాయంపై రూ. 1581 కోట్లు ఉంటుందని భావించారు. నికర లాభం అంచనాల్లో దాదాపు సగమే ఉంది.. ఇక రెండో త్రైమాసికంతో పోలిస్తే భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 27 శాతం తగ్గింది. భారత్‌లో కంపెనీ కస్టమర్ల సంఖ్య 5,59,000 మంది తగ్గారు. దాదాపు 16 దేశాల్లో విస్తరించిన ఈ కంపెనీకి భారత మార్కెట్ కీలకం. కంపెనీ ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం (average revenue per user -ARPU) రూ. 163లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ARPU రూ.146గా ఉండేది.