ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లిస్టింగ్?
భారతి ఎయిర్టెల్ తన ఫిన్‌టెక్ సంస్థను లిస్ట్ చేయాలని భావిస్తోంది. భారతి ఎయిర్టెల్ గ్రూప్‌లో ఫిన్‌టెక్ వ్యాపారాన్ని సంస్థ చేపడుతోంది. ఏడాదికి రూ. 1000 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. అయితే వృద్ధిరేటు జోరుగా ఉందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. ఎయిర్టెల్ కంపెనీకి ఇంకా యాడ్స్ చేసే సంస్థతో పాటు సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా ఉంది. అయితే పేమెంట్ బ్యాంక్‌ను లిస్ట్ చేసేందుకు ఎయిర్టెల్ ఆసక్తితో ఉంది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుకు 5 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ కంపెనీ ప్రస్తుతం లాభాలతో నడుస్తోంది. పేమెంట్ బ్యాంక్ ఇపుడురూ. 941 కోట్ల టర్నోవర్‌పై రూ. 9 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది రూ. 434 కోట్ల టర్నోవర్‌పై రూ. 464 కోట్ల నష్టాన్ని పొందింది. ఈ విభాగం లాభాల్లోకి వచ్చినందున లిస్ట్ చేయాలని భారతి ఎయిర్ టెల్ భావిస్తోంది. మరోవైపు చార్జీలను కూడా పెంచాలని ఎయిర్టెల్ భావిస్తోంది. దీంతో ఇవాళ ఎయిర్టెల్ షేర్ పెరిగే ఛాన్స్ ఉంది.