ఆర్బీఐ పాలసీ… నిఫ్టి బ్యాంక్ అప్
మార్కెట్ ఆశించినస్థాయిలోనే వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకు షేర్లు చాలా పాజిటివ్‌గా స్పందించారు. నిఫ్టి బ్యాంక్ ఏకంగా 1.46 శాతం, నిఫ్టి ఫైనాన్స్ సూచీ 1.23 శాతం లాభంతో ఉన్నాయి. ఇవాళ దాదాపు అన్ని బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ షేర్లు రెండు శాతంపైగా పెరిగాయి. కొటక్ బ్యాంక్ కూడా 1.94 శాతం పెరిగింది. మిగిలిన బ్యాంక్ షేర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలలో హెచ్డీఎఫ్సీ, ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ లాభపడ్డాయి.