నికర లాభం 94 శాతం డౌన్
అధిక ప్రావిజన్స్ చేయాల్సి రావడంతో బంధన్ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. మార్చి నెలతో ముగిసిన త్రైమాసానికి, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ఇవాళ బంధన్ బ్యాంక్ ప్రకటించింది. సీఎన్బీసీ టీవీ18 నిర్వహించిన పోల్లో బ్యాంక్ నికర లాభం రూ. 808 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే బ్యాంక్ రూ. 54.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 94 శాతం క్షీణించింది.అయితే నికర వడ్డీ ఆదాయం మాత్రం అంచనాలను మించి రూ. 2471 కోట్ల నుంచి రూ. 2866 కోట్లకు చేరింది. ప్రొవిజనింగ్ కోసం రూ.1,774 కోట్లు కేటాయించినట్లు బ్యాంక్ తెలిసింది. గత ఏడాది కాలంలో బ్యాంక్ ఈ పద్దు కింద రూ. 735 కోట్లు కేటాయించింది. గ్రాస్ ఎన్పీఏ కింద కేటాయించిన మొత్తం 41శాతం తగ్గి రూ. 4,785 కోట్లకు చేరింది. నెట్ ఎన్పీఏ మరింతగా అంటే 45 శాతం తగ్గింది.