క్రిప్టోల నిషేధమే బెస్ట్
క్రిప్టో కరెన్సీలను నిషేధించడమే సరైన చర్య అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ అన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సమావేశంలో ప్రధానోపన్యాసం ఇస్తూ పోంజీ స్కీమ్ల కన్నా క్రిప్టో కరెన్సీలు దారుణమైనవని, దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ఇవి ముప్పు అని స్పష్టం చేశారు. కరెన్సీ, ద్రవ్య, బ్యాంకింగ్ వ్యవస్థలన్నింటినీ క్రిప్టోలు కుప్పకూల్చుతాయని ఆయన హెచ్చరించారు.. అందుకే క్రిప్టోలను నిషేధించడమే సరైన చర్య అని అన్నారు.