బ్లాక్ స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్?
కేర్ హాస్పిటల్ టేకోవర్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ రేస్‌లో బ్లాక్ స్టోన్ ముందు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీతో పాటు టెమసెక్‌కు చెందిన సింగపూర్ సంస్థ శ్రేయాస్ హెల్త్‌కేర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం. డీల్ విలువ రూ. 8000 కోట్ల నుంచి రూ. 8200 కోట్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. కేర్ హాస్పిటల్‌కు భారత్‌తో పాటు, బంగ్లాదేశ్‌లలో 15 హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో 2400 బెడ్స్ ఉన్నాయి.