అదరగొట్టిన బాలాజి అమిన్స్ షేర్
స్పెషాలిటీ కెమికల్స్ తయారీదారు బాలాజి ఇవాళ ఒకదశలో పది శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. షేర్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నా… ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ రూ. 3714ని తాకిన షేర్ చివర్లో రూ.3620 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే షేర్ 7.29 శాతం పెరిగింది. నిన్నటి లాభాలతో పోలిస్తే ఈ షేర్ పది శాతం దాకా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ 44 శాతం పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. అలాగే నికరలా భం కూడా 29 శాతం పెరిగి రూ. 101 కోట్లకు చేరింది. వాస్తవానికి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ప్లాంట్ కొన్నాళ్ళు మూతపడింది. అందుకే సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే లాభం 15 శాతం, టర్నోవర్ 7 శాతం పెరిగింది. ప్లాంట్ మూతపడినా ఈ స్థాయి పనితీరు కనబర్చినందుకు ఈ షేర్‌ను ఇన్వెస్టర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.