For Money

Business News

5న బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఐపీఓ

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాతృసంస్థ ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఎంఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 5న ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి రూ.500 కోట్ల సమీకరణ కోసం ఉద్దేశించిన ఈ పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 7న ముగుస్తుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించనున్న నిధుల్లో రూ.111.14 కోట్లను వ్యాపార విస్తరణ కోసం వెచ్చించనుండగా రూ.220 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ.55 కోట్లను రుణాల చెల్లింపు కోసం కంపెనీ వినియోగించనుంది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌కు దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో 112 రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. ఎక్కువ స్టోర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. అక్టోబరు 17న కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టవుతాయి.