బజాజ్ ఆటో పనితీరు సూపర్
జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో బజాజ్ ఆటో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ నికర లాభం రూ.1,665 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన రూ.1,173.30 కోట్లతో పోలిస్తే నికర లాభం 42 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం 29 శాతం పెరిగి రూ. 8005 కోట్ల నుంచి 10310 కోట్లకు చేరింది. ఆదాయం, నికర లాభం..రెండూ మార్కెట్ అంచనాలకు కాస్త తక్కువగానే ఉన్నాయి. కంపెనీ ఎగుమతులు మాత్రం 5,80,810 యూనిట్ల నుంచి 34శాతం తగ్గి 3,85,851 యూనిట్లకు చేరాయి. ఎబిటా మార్జిన్స్ 0.3 శాతం తగ్గింది. మోటార్‌సైకిల్స్ విభాగం బాగా రాణించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాహన అమ్మకాలు 10శాతం పెరిగాయని బాజాజ్ ఆటో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 9,33,646 యూనిట్లు విక్రయించగా ఈ ఏడాదిలో 10,27,407 యూనిట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది.