యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ. 3133 కోట్లు
ఒక త్రైమాసికంలో ఎన్నడూ సాధించిన నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ సాధించింది. ఈ లాభం మార్కెట్ అంచనాలకు అనుణంగానే ఉంది.ఈ మూడు నెలల కాలంలో బ్యాంక్ రూ. 3,133 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో ఆర్జించిన రూ. 1,682 కోట్లతో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 86 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం… నిరర్థక ఆస్తుల కోసం బ్యాంక్ చేసిన కేటాయింపులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఈ కేటాయింపులు బాగా తగ్గాయి. అందుకే నికర లాభం భారీగా పెరిగింది. బ్యాంక్ మొత్తం ఆదాయం మాత్రం రూ. 19,550 కోట్ల నుంచి రూ. 20,134 కోట్లకు చేరింది. స్థూల ఎన్పీఏలు 4.18 శాతం నుంచి 3.53 శాతానికి తగ్గాయి. కాని నికర ఎన్పీఏలు రూ. 0.98 శాతం నుంచి 1.08 శాతానికి పెరిగాయి. నిరర్థక ఆస్తుల కోసం బ్యాంక్ కేటాయించిన మొత్తం ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,343 కోట్లు కేటాయించిన బ్యాంక్ ఈ ఏడాది రూ. 1,735 కోట్లు మాత్రమే కేటాయించింది. బ్యాంక్ నికర లాభం భారీగా పెరగడానికి ఇదొక కారణం.