For Money

Business News

52 వారాల కనిష్ఠ స్థాయికి అరబిందో

అరబిందో ఇన్వెస్టర్ల గత ఏడాది భారీగా నష్టపోయారు. ప్రతిసారీ ఏదో ఒక ప్రతికూల వార్త రావడంతో కంపెనీ షేర్‌పై ఒత్తిడి పెరిగుతోంది. తాజాగా అమెరికా ఎఫ్‌డీఐ వార్నింగ్‌ తరవాత అరబిందో ఫార్మా షేర్‌ నిన్న 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిన్న ఒక దశలో ఈ షేర్‌ రూ. 560.25ను తాకింది. తరవాత క్లోజింగ్‌లో కోలుకుని రూ. 581 వద్ద ముగిసింది. ఈ కంపెనీ షేర్‌ సరిగ్గా ఏడాది క్రితం అంటే 2011.. మే11వ తేదీన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1,063.90ని తాకింది అక్కడి నుంచి 45 శాతం క్షీణించింది. కంపెనీ షేర్‌లో భారీ ఒత్తిడి వొస్తున్నా కొనుగోలుదారులు అంతంత మాత్రమే ఉన్నారు. 45 శాతం పడినా కంపెనీ షేర్లను డెలివరీ తీసుకుంటున్నవారి సంఖ్య17 శాతం ఉండటం గమనార్హం.
ఎఫ్‌డీఐ వార్నింగ్‌
అరబిందో ఫార్మాకు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సంసథ షాక్‌ ఇచ్చింది. అరబిందోకు హైదరాబాద్‌ సమీపంలోని జడ్చర్లలో ఉన్న తయారీ ప్లాంట్‌ను తనిఖీ చేసిన మీదట ఆరు అభ్యంతరాల్ని ఎఫ్‌డీఏ వ్యక్తం చేసింది. ఓరల్‌ ఔషధాల్ని తయారు చేసే ఈ ప్లాంట్‌లో మే 2 నుంచి 10 వరకూ ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఆరు అభ్యంతరాలతో కూడిన ’ఫారమ్‌ 483’ను కంపెనీకి జారీచేశారు. ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాల్ని నిర్ణీత సమయంలోగా కంపెనీ సరిచేయాల్సి ఉంటుంది. విటమిన్‌ బి12 లేమితో ఏర్పడే రుగ్మతల చికిత్సకు ఉపయోగించే సైనోకోబాలమిన్‌ ఇంజెక్షన్లను అమెరికా మార్కెట్‌ నుంచి అరబిందో ఫార్మా సబ్సిడరీ రీకాల్‌ చేసినట్టు ఎఫ్‌డీఏ తెలిపింది.